Daily Horoscope
✕

ఈ ఒక్క పిక్ చాలు బ్రదర్ : కేటీఆర్‌ ఫోటోపై రచయిత కోన వెంకట్ కామెంట్స్

Updated: మంగళవారం, 11 డిశెంబరు 2018 (13:02 IST)
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక్త ప్రొఫైల్ ఫోటోను పెట్టారు. తుపాకీ పట్టుకుని గురిచూసి కొడుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో సోషల్‌ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ ఫొటోకు ఇప్పటికే 16 వేల లైక్‌లు, వెయ్యికి పైగా రీట్వీట్లు వచ్చాయి.
 
"కేటీఆర్‌.. గురిచూసి కొడుతున్నారు.. విజయం ఆయనదే.." అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ శాసనసభ ఎన్నికల్లో మళ్లీ తెరాసే అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్లు పెడుతున్నారు.
 
అయితే, ఈ ఫోటోతో పాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సినీ నిర్మాత, రచయిత కోన వెంకట్ స్పందించారు. 'ఈ ఒక్క ఫొటో చాలు బ్రదర్‌.. ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి. శుభాకాంక్షలు' అని వెంకట్ ట్వీట్ చేశారు.
 
ఈ ఫొటోపై దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కూడా కామెంట్‌ చేశారు. 'ఈ ఫొటో కాన్ఫిడెన్స్‌కు కొత్త అర్థం చెబుతోంది. ఫలితాల నేపథ్యంలో కేటీఆర్‌ కొత్త ఫొటోను పెట్టారు' అని ట్వీట్‌ చేశారు. మంగళవారం వెల్లడవుతున్న ఎన్నికల ఫలితాల్లో తెరాస 92 చోట్ల, ప్రజా కూటమి 19, బీజేపీ 2, ఎంఐఎం 5, ఇతరులు ఒక్క చోట ఆధిక్యంలో ఉన్నారు. 

అన్నీ చూడండి

Nag: ఇట్లు అర్జున సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది : నాగార్జున

Devika Bhat: రియాలిటీ ప్రేమలో మునిగిపోయిన కిరణ్ అబ్బవరం, దేవికా భట్

Jabardasth Emmanuel: నందినీ రెడ్డి ఆవిష్కరించిన డెస్టినీ ఫస్ట్ లుక్

Dulquer Salmaan: ఆకాశంలో ఓ తార చిత్రం టీజర్ సిద్ధమవుతోంది

Kalki 2: ప్రభాస్ పుట్టినరోజు తర్వాత కల్కి సీక్వెల్ ముంబైలో జరగనుంది ?

తర్వాతి కథనం
Show comments