ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 జూన్ 2018 (15:45 IST)

అంజలి "గీతాంజలి-2"గా మళ్లీ భయపెట్టేందుకు వచ్చేస్తోంది..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రధాన పాత్రలో ''గీతాంజలి'' సినిమా హిట్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గీతాంజలికి సీక్వెల్ రానుంది. గీతాంజలి-2 పేరిట ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులోనూ అంజ

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రధాన పాత్రలో ''గీతాంజలి'' సినిమా హిట్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గీతాంజలికి సీక్వెల్ రానుంది. గీతాంజలి-2 పేరిట ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులోనూ అంజలి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌ (కేఎఫ్‌సీ), ఎం.వి.వి.సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
భారతీయ సంతతికి చెందిన అమెరికా వ్యక్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్టు నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్‌ తెలిపారు. ఈ సినిమా వివరాల్ని ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.
 
ఇంకా కోన వెంకట్‌ మాట్లాడుతూ.. తమ సంస్థ నుంచి అభినేత్రి, నిన్ను కోరి చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. త్వరలోనే ఆది పినిశెట్టి, తాప్సి, రితికసింగ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన ''నీవెవరో'' కూడా విడుదల కాబోతోందన్నారు. అలాగే త్వరలోనే ''గీతాంజలి 2''ని సెట్స్‌పైకి తీసుకెళతాం. థ్రిల్లర్‌ కామెడీ కథతో ఈ చిత్రం రూపొందబోతోందని చెప్పారు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తామని చెప్పారు.