శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (16:22 IST)

బాబా వార్నింగ్‌కు దిగివచ్చిన యోగి.. బాబ్బాబూ.. ప్లీజ్ అంటూ...

యోగా గురువు రాందేవ్ బాబా వార్నింగ్‌కు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగివచ్చారు. బాబ్బాబూ.. ప్లీజ్.. మా రాష్ట్రాన్ని వీడి వెళ్లకండి అంటూ ప్రాధేయపడ్డారు. దీంతో రాందేవ్ బాబా మెత్తబడ్డ

యోగా గురువు రాందేవ్ బాబా వార్నింగ్‌కు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగివచ్చారు. బాబ్బాబూ.. ప్లీజ్.. మా రాష్ట్రాన్ని వీడి వెళ్లకండి అంటూ ప్రాధేయపడ్డారు. దీంతో రాందేవ్ బాబా మెత్తబడ్డారు.
 
యమునా ఎక్స్‌ప్రెస్ వే పొడవునా రూ.6 వేల కోట్లతో 425 ఎకరాల్లో ఫుడ్, హెర్బల్ పార్కు నిర్మించేందుకు పతంజలి తలపెట్టింది. దీని ద్వారా దేశవాళీ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోకి తమ ఉత్పత్తులను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైఈఐడీఏ)కి ఇంకా అనుమతులు రాలేదు. 
 
దీనిపై పతంజలి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 'ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు రానందున మేము ఈ ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నాం' అంటూ పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ ఓ ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టును వేరే రాష్ట్రంలోకి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించారు.  
 
ఈ విషయం సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. దీంతో మంగళవారం రాత్రి హుటాహుటిన పతంజలి వ్యవస్థాపకుడు రాందేవ్ బాబాకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విషయంలో "చిన్నపాటి సమస్యలు" ఉన్నాయనీ.. త్వరలోనే వాటిని పరిష్కరించి అనుమతులు మంజూరు చేస్తామని రామ్‌దేవ్ బాబాకు సీఎం హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన హామీలపై యోగా గురు సంతృప్తి వ్యక్తం చేసినట్టు వినిపిస్తోంది.