మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 జూన్ 2017 (14:22 IST)

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలి : రాందేవ్ బాబా

పాకిస్థాన్ - భారత్ దేశాల మధ్య ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడమే ఏకైక పరిష్కార మార్గమని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తెలిపారు.

పాకిస్థాన్ - భారత్ దేశాల మధ్య ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడమే ఏకైక పరిష్కార మార్గమని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం పాకిస్థాన్ అధీనంలో ఉన్న ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పాక్‌తో నెలకొన్న అన్ని సమస్యలకూ ఇదొక్కటే పరిష్కారమన్నారు. 
 
పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలన్నిటినీ భారత సైన్యం ధ్వంసం చేయాలని సలహా ఇచ్చారు. భారత్‌లో రక్తపాతం సృష్టించిన దావూద్ ఇబ్రహీంతో పాటు, సరిహద్దుల్లో చొరబాట్లను ప్రోత్సహిస్తూ, ఉగ్రవాదులను ఇండియాకు పంపుతున్న అజర్ మసూద్, హఫీజ్ సయీద్ తదితరులను ప్రాణాలతోనైనా లేదా మృతదేహాలుగానైనా భారత్ కు అప్పగించాలని రాందేవ్ డిమాండ్ చేశారు. యోగాను రాజకీయ ఎజెండాగా చూడరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.