Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఆ పప్పుకు అర్థమయ్యేలా చేస్తాం: రోజా సంచలన వ్యాఖ్యలు

Written By జె
Updated: సోమవారం, 16 ఆగస్టు 2021 (21:45 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు నగరి ఎమ్మెల్యే రోజా. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో సరిగ్గా చెప్పలేని పప్పు నారా లోకేష్‌కు సీఎంను విమర్శించే అర్హత లేదన్నారు. అసలు ఏం మాట్లాడతాడో అతనికే తెలియదంటూ లోకేష్ పైన మండిపడ్డారు రోజా.
 
చిత్తూరు జిల్లా నగరిలో ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభమైన సందర్భంగా రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ఏ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను అడిగినా వారు టక్కున సమాధానం చెబుతారని రోజా చెప్పుకొచ్చారు.
 
లోకేష్‌కు అన్ని అర్థమయ్యే విధంగా త్వరలోనే చేస్తామన్నారు. ఎన్నో పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అత్యద్భుతమైన పాలనను అందిస్తున్నారని రోజా చెప్పారు. 
 
ప్రతిపక్ష నేతలకు ఏదో ఒక సాకు చూపించి ప్రజల దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్ష నేతలకు ఏ సమయంలోనైనా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments