1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:42 IST)

వరుడుకు పాజిటివ్.. అయినా పెట్టిన ముహూర్తానికే వివాహం .. ఎలా?

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలం నానాటికీ పెరిగిపోతోంది. తొలిదశ వైరస్ వ్యాప్తి కంటే.. రెండో దశ వ్యాప్త ఎన్నో రెట్లు అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. 
 
కరోనాపై పోరాటం కోసం నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇక కరోనా వేళలో జరుగుతున్న వివాహాలు, వివాహ వేడుకలు వార్తలుగా విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పుడు అటువంటిదే ఓ పెళ్లికి సంబంధించిన విశేషం. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అలా ఎలా? నిబంధనలు ఒప్పుకోవు కదా? అయినా పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? ఇవేగా మీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలంటే  ఈ కథనం చదవండి. 
 
ఈ రాష్ట్రంలోని రత్లాంకు చెందిన ఓ యువకునికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, అప్పటికే అతని వివాహం నిర్ణయం అయిపోయింది. కరోనా నేపథ్యంలో పెళ్లి వాయిదా వేయాలని భావించారు. అయితే, వధువు తరపు వారు ఎలాగైనా ఈ ముహూర్తంలో పెళ్లి జరగాలని వరుడు తరపు వారిని కోరారు. 
 
దాంతో ఇరువురూ చర్చించుకుని అదే ముహూర్తానికి పెళ్ళిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరినీ పిలవకుండా రెండు కుటుంబాల పెద్దలు దగ్గరుండి జరిపించాలని భావించారు. ఈ విషయం జిల్లా అధికారులకు ఎవరో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పెళ్లిని ఆపడానికి ఆ ప్రాంత తహశీల్దార్ వచ్చారు. 
 
కరోనా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పెళ్లిని ఆపుచేయాలనీ, దీనికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలనీ వచ్చిన వారికి అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఏమీచేయలేక పోయారు. ఏమీ అనలేకపోయారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. పెళ్లి కూతురు.. పెళ్లి కొడుకూ ఇద్దరూ పీపీఈ కిట్లతో పీటల మీద కూచుని ఉన్నారు. 
 
పెళ్లి పెద్దలు కూడా కోవిడ్ నినంధనలు అన్నీ పాటిస్తున్నారు. తహశీల్దార్‍‌కు ఆ పెళ్లి ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరంగా చెప్పారు వరుడు, వధువు తరఫు వారు వివరించి చెప్పారు.
 
ఇక కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి మధ్యప్రదేశ్ అంతా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. పెళ్లిళ్లకు 50 మంది కంటె ఎక్కువ మందిని అనుమతించడం లేదు. అంతేకాదు అక్కడ ఒక పోలీసు అధికారి పది మంది కంటె తక్కువ హాజరుతో పెళ్లి చేసుకుంటే, వారందరికీ విందు ఇవ్వాలని నిర్ణయించారు.
 
పది లేదా అంతకంటే తక్కువ అతిథుల సమక్షంలో వివాహం చేసుకుంటే నేను వారికి, వధువు-వరుడు తొ సహా నా ఇంట్లో రుచికరమైన విందు ఇవ్వబోతున్నాను అని పోలీస్ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సింగ్ చెప్పారు. ఈ జంటలకు మెమెంటోలు కూడా ఇస్తామన్నారు. అదేవిధంగా వారిని ప్రభుత్వ వాహనంలో తీసుకొచ్చి తిరిగి పంపిస్తాం అని అయన వివరించారు.