శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (13:22 IST)

పెళ్లి కాకుండానే గర్భం.. తమ్ముడితో శృంగారం.. ఇంట్లోనే ప్రసవం.. టీచర్ మృతి

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెకు కుటుంబీకులు ఇంట్లోనే ప్రసవం చేశారు. ఆమె మృతిచెందడంతో బిడ్డను చెత్త కుండీలో పడేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె ప్రియుడు, కుటుంబసభ్యుల్ని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. 
 
దిండుగల్‌ జిల్లా పళని సమీపంలోని ఆరుకుడికి చెందిన మణియన్‌ కుమార్తె మంగయకరసి(29) ప్రయివేటు స్కూల్‌ టీచర్‌. 2019లో కొవిడ్‌ రూపంలో ఎదురైన లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటూ పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతోంది.
 
ఈ సమయంలో వారి ఇంట్లో ఉన్న సమీప బంధువైన యువకుడికి మంగయ కరసి దగ్గరైంది. ఇద్దరు చనువుగా ఉన్నా, కుటుంబీకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇందుకు కారణం, ఆ యువకుడు మంగయకరసికి తమ్ముడి వరుస కావడమే. 
 
అయితే, వీరు శారీరకంగా కలవడంతో మంగయ కరసి గర్భం దాల్చడం, అబార్షన్‌ కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ కుటుంబం బయటకు తెలిస్తే పరువు పోతుందని..  ఆమెకు ఇంట్లోనే ప్రసవం చేశారు. కానీ ప్రమాదవశాత్తు మంగయ చనిపోయింది. కాగా కుటుంబీకులు బిడ్డను చెత్త కుండీలో వేయడంతో అసలు విషయం బయట పడింది.