పాముకు దాహం వేసింది.. నీళ్లు ఎలా తాగించాడంటే..?  
                                       
                  
				  				   
				   
                  				  పాములంటే జనాలకు వణుకు. అయితే ఓ వ్యక్తి మాత్రం వేసవి కాలంలో నీళ్ళు లేక అల్లాడిన నాగుపామును నీళ్లు తాగించాడు. తాజాగా  ఓ వ్యక్తి పాము దగ్గరికి వెళ్లి మరీ దానికి నీళ్లు తాగించాడు. నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా.. ఈ దృశ్యం తమిళనాడులో చోటుచేసుకుంది. కడలూరులోని అటవీ ప్రాంతంలో పాముకు ఓ వ్యక్తి నీళ్లు తాగిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
				  											
																													
									  
	 
	వేసవిలో పాము దాహం తీర్చుతున్న ఓ మంచి మనిషి అని ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఏమాత్రం భయపకుండా దాహంతో ఉన్న పాముకు దగ్గరగా వెళ్లి దాని నోటికి దగ్గరగా ఓ బాటిల్‌తో నీళ్లు తాగించాడు. దాహంతో ఉన్న ఆ పాము వ్యక్తిని కాటేయాలని ప్రయత్నిస్తూనే మరోవైపు నీటిని తాగేసింది. అంతేగాక అతను పాము కోసం నీటిని నేలపై పోసి తాగించాడు. 
				  
	 
	అనంతరం పామును జాగ్రత్తగా అడవిలో వదిలేశాడు. పాముకు దగ్గరగా వెళ్లి మరీ నీరు తాగిస్తున్న సదరు వ్యక్తి ధైర్యానికి అవాక్కవుతూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. విభిన్న రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యక్తిని సెల్వా అనే వన్యప్రాణిలను కాపాడటంలో ఉత్సాహికుడని గుర్తించారు, అతను మానవ స్థావరాలలోకి ప్రవేశించే పాములను రక్షించి సమీపంలోని అటవీ ప్రాంతాలకు సురక్షితంగా విడుదల చేస్తాడు.