Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

అరుదైన నలుపు వజ్రం.. నక్షత్ర మండలం నుంచి ఊడిపడింది..

Written By సెల్వి
Updated: మంగళవారం, 18 జనవరి 2022 (20:15 IST)
black diamond
వజ్రం అంటే రోజా పువ్వులాంటివి.. ఆకుపచ్చవి చూసివుంటాం. ఎప్పుడైనా నలుపు వజ్రాన్ని చూశారా? అయితే ఈ కథనం చదవాల్సిందే. నక్షత్ర మండలం నుంచి ఊడిపడిన అలాంటి ఓ అరుదైన నలుపు వజ్రాన్ని లండన్ లోని సోతెబీ అనే సంస్థ వేలం వేయనుంది. 260 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఓ పెద్ద ఉల్క లేదా గ్రహశకలం భూమిని ఢీకొట్టినప్పుడు ఈ వజ్రం ఏర్పడి ఉంటుందని సోతెబీ వేలం సంస్థ జ్యువెలరీ స్పెషలిస్ట్ సోఫీ స్టీవెన్స్ చెప్పారు.
 
ఇది నలుపు రంగులో వుందని.. ఎలా వుద్భవించిందనేది ఇప్పటికీ మిస్టరీనేనని సోతెబీ వెల్లడించింది. 20 ఏళ్ల క్రితం వరకు కూడా ఆ వజ్రాన్ని బయటకు తీసుకురాలేదని తెలిపింది. ఆ తర్వాత నిపుణులు 55 మొహాలతో వజ్రాన్ని రూపుదిద్దారని పేర్కొంది. శక్తి, రక్షణకు చిహ్నమైన మిడిల్ ఈస్ట్  పామ్ ఆకారంలోనే దీనిని రూపొందించారు.
 
కాగా, అతిపెద్ద అరుదైన నలుపు వజ్రంగా 2006లో దీనికి గిన్నిస్ రికార్డు కూడా ఉందని సోతెబీ వెల్లడించింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఈ వజ్రాన్ని ఆ తర్వాత లాస్ ఏంజిలిస్, లండన్‌లకు తీసుకెళ్లనున్నారు. ఫిబ్రవరి 3న ఆన్ లైన్‌లో వేలం నిర్వహించనున్నారు. ఇదో అంతరిక్ష అద్భుతం అని సోతెబీ పేర్కొంటోంది. దాని పేరు ‘ఎనిగ్మా’.. బరువు 555.55 క్యారెట్లు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments