శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

మరో ఆరు నెలల్లో కరోనా కథ కంచికి : ఇండో అమెరికన్ డాక్టర్ లోకేశ్వరరావు

ప్రపంచాన్ని గత రెండు సంవత్సరాలుగా భయపెడుతున్న కరోనా వైరస్ కథ మరో ఆరు నెలల్లో ముగుస్తుందని ఇండో, అమెరికన్ వైద్యుడు డాక్టర్ లోకేశ్వర్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ వైరస్ మున్ముందు సాధారణ జలుబులా చేరుకుంటుందని తెలిపారు. అయితే, ప్రజలు మాత్రం విధిగా ముఖానికి మాస్క్‌లు ధరించాల్సి ఉంటుందన్నారు. అలాగే, టీకాలు వేసుకోవాలని సూచించారు. 
 
అదేసమయంలో ఒమిక్రాన్ వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇది ఊపిరితిత్తులకు చేరకముందే నిర్వీర్యం అవుతుందని ఆయన చెప్పారు. అమెరికాలో వృద్ధులు ఎక్కువగా ఉన్నారని, పైగా, టీకాలు ఎక్కువ మంది తీసుకోకపోవడం, సరైన అవగాహన లేకపోవడం వల్ల అధిక ప్రాణనష్టం సంభవించిందని తెలిపారు. అదేసమయంలో ఈ వైరస్ నుంచి విముక్తి పొందడం కోసం కంటినిండగా నిద్రపోవడం, వ్యాపాయం, ధ్యానం చేయడం వంటి వాటివల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆయన తెలిపారు.