Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

హౌజ్‌ఫుల్-4 సెట్స్‌లో అలా జరిగిందా?

Updated: శనివారం, 27 అక్టోబరు 2018 (17:36 IST)
దేశంలో మీ టూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు నిర్భయంగా తమ చేదు అనుభవాలను బహిర్గతం చేస్తున్నారు. తాజాగా... హౌజ్‌ఫుల్‌-4 సినిమా షూటింగ్‌ సమయంలో కొంతమంది వ్యక్తులు తనపై లైంగిక దాడికి ప్రయత్నించారంటూ ఓ మహిళా జూనియర్‌ ఆర్టిస్టు ఆరోపించారు. 
 
హీరోలు అక్షయ్‌ కుమార్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ సెట్లో ఉన్న సమయంలోనే తాను ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సినిమా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ఈ వివాదంపై వివరణ ఇచ్చారు. సదరు జూనియర్‌ ఆర్టిస్టు స్నేహితుడికి సినిమాతో ఎలాంటి సంబంధం లేదు. జూనియర్ ఆర్టిస్టు స్నేహితుడికి డాన్స్‌మాస్టర్‌కు గొడవ జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. 
 
కానీ ఆ సమయంలో అక్షయ్‌, రితేశ్‌ అక్కడ లేరని ఎగ్జిక్యూటివ్ నిర్మాత స్పష్టం చేశాడు. వ్యక్తిగత విషయాల కారణంగా జరిగిన గొడవను సినిమా యూనిట్‌కు ఆపాదించాలని ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 
 
గొడవ జరిగిన సమయంలో తన అసిస్టెంట్‌ అక్కడే ఉన్నారని.. జూనియర్‌ ఆర్టిస్టు చెబుతున్నట్లుగా ఆమెను ఎవరూ లైంగిక వేధించలేదని తనతో చెప్పినట్లు వెల్లడించాడు. ఇప్పటికే వివిధ కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యమవుతుంటే.. సంబంధంలేని విషయాల్లో కూడా ఇలా తమను ఇరికించడం సరికాదని చెప్పుకొచ్చారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం