బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (16:23 IST)

డీఎంకే సభ్యుడుని కాదు... ఆ పార్టీ గురించి నన్ను అడగొద్దు : అళగిరి

తాను డీఎంకే సభ్యుడిని కాదనీ, అందువల్ల ఆ పార్టీ గురించో... ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం గురించో తనను ప్రశ్నిచవద్దని దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే.అళగిరి మీడియా మిత్రులను కోరార

తాను డీఎంకే సభ్యుడిని కాదనీ, అందువల్ల ఆ పార్టీ గురించో... ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం గురించో తనను ప్రశ్నిచవద్దని దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే.అళగిరి మీడియా మిత్రులను కోరారు. 
 
ఆయన సోమవారం మెరీనాలోని తన తండ్రి సమాధిని సందర్శించి మరోమారు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'మా తండ్రికి నిజమైన బంధువులైన వారంతా నా వైపే ఉన్నారు. తమిళనాడులోని మద్దతుదారులంతా నా వెనుకే ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్నారు' అని చెప్పారు.
 
పరోక్షంగా పార్టీ నాయకత్వ అంశాన్ని ప్రస్తావిస్తూ, కాలమే దీనికి సరైన సమాధానం చెబుతుందని, ప్రస్తుతానికి తాను చెప్పదలచుకున్నది ఇంతేనని అళగిరి వ్యాఖ్యానించారు. అదేసమయంలో ఈనెల 14వ తేదీన జరుగనున్న పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం గురించి ప్రస్తావిస్తూ తాను డీఎంకే సభ్యుడిని కాదని, అందవల్ల ఆ అంశం గురించి తన వద్ద ప్రస్తావించవద్దని కోరారు. 
 
కాగా, మదురై నగరం నుంచి 2009 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన అళగిరి, కేంద్రంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతర క్రమంలో పార్టీ ఆయనను పక్కనబెడుతూ వచ్చింది. స్టాలిన్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసిన కరుణానిధి... తన రాజకీయ వారసుడు కూడా ఆయనేనని ఓ దశలో ప్రకటించారు. ఈ పరిణామాలతో కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్న అళగిరి మరోసారి కార్యకర్తల్లో తనకున్న పట్టు చాటుకునే ప్రయత్నంలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.