Webdunia - Bharat's app for daily news and videos

Install App

వావ్ యమ్మీ.. చికెన్ పచ్చడి ఇలా చేయండి.. రోజా రెసిపీ (వీడియో)

Written By సెల్వి
Updated: మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (19:33 IST)
వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఎప్పుడూ రాజకీయాలు, షోలు అంటూ బిజీ బిజీగా గడుపుతుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన కారణంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం రోజా కూడా ఇంట్లో వుంటూ హాయిగా వంటలు చేసుకుంటున్నారు. రోజూ వంటలు చేస్తూ యూ ట్యూబ్‌లో పెడుతుంది. అంతేకాదు తయారీ విధానం కూడా చెబుతుంది రోజా. 
 
మొన్నటికి మొన్న ఈమె చేసిన చికెన్ ఫ్రై చేస్తే నిర్మాత బండ్ల గణేష్ కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఇక ఆ తర్వాత రోజు గుత్తి వంకాయ్ ఫ్రై ఎలా చేయాలో చూపించింది రోజా. మొన్న మళ్లీ కొత్త వంట.. మీ కోసమే రుచికరమైన బీట్‌రూట్ ఛట్నీ అంటూ వచ్చేసింది ఈ జబర్దస్త్ జడ్జి. ఆవకాయ్ పచ్చడి కూడా చేసి చూపించింది. 
 
ఇప్పుడు చికెన్ పచ్చడి అంటూ ముందుకు వచ్చింది. చికెన్ పచ్చడి ఎలా చేయాలని కూడా చెప్పింది. లాక్ డౌన్‌లో వుంటూ తన కుటుంబంతో హ్యాపీగా గడిపేస్తుంది రోజా. రోజా మాత్రమే కాదు.. ప్రస్తుతం తెలుగు సినిమా సెలబ్రిటీస్ అంతా పూర్తిగా వంటలతోనే బిజీ అయిపోయారు. వాళ్ల వాళ్ల వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంకేముంది.. రోజా చికెన్ పచ్చడి ఎలా చేశారో.. ఈ వీడియో ద్వారా ఓ లుక్కేయండి. 
 

అన్నీ చూడండి

Gautam: గౌతమ్ ఘట్టమనేని కు కుటుంబసభ్యులు, ఫౌండేసన్ శుభాకాంక్షలు

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments