శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (13:53 IST)

కరోనా నిబంధనలు ఉల్లంఘన : అంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ళ జైలు

మయన్నార్ ఉక్కుమహిళగా పేరుగడించిన అంగ్ సాన్ సూకిని ఆ దేశ సైనిక ప్రభుత్వం నాలుగేళ్ళపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆమెపై నమోదైన కేసును విచారించిన కోర్టు ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వాకీటాకీని అక్రమ పద్ధతిలో దిగుమతి చేసుకోవడం, కరోనా నిబంధనలను ఉల్లంఘిచారన్న ఆరోపణల కేసుల్లో ఆమెకు కోర్టు జైలుశిక్షను విధించింది. 
 
దీంతో ఆమెను జైలుకు తరలించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమెను అక్కడి సైన్యాధ్యక్షుడు పదవి నుంచి తప్పించి సైనిక పాలనచేపట్టిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారు. 
 
మరోవైపు, సూకీని అధికారం నుంచి తప్పించి, గృహ నిర్బంధంలో ఉంచిన వెంటనే ఆ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. 76 యేళ్ల సూకికి మద్దతుగా సైన్యానికి వ్యతిరేకంగా ఆమె మద్దతుదారులు దేశంలో ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనను మయన్మార్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసిన విషయం తెల్సిందే.