ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 మార్చి 2024 (16:36 IST)

మొబైల్ గేమ్‌లో నిమగ్నమైన బాలుడు.. చిరుత వచ్చింది.. ఆపై ఏం జరిగిందంటే?

Chitah
Chitah
చిరుతను చూస్తే వామ్మో అని జడుసుకుని పారిపోతాం. అయితే ఓ బాలుడు చిరుతను చూసి భయపడకుండా ఇంట్లోకి వచ్చిన చిరుతను లోపలికి పోయాక సెల్ ఫోన్ తీసుకుని బయటికి వచ్చి డోర్ లాక్ చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన నాసిక్‌లోని మాలెగావ్‌లో వెలుగుచూసింది. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది.  
 
చిరుతపులి అనూహ్యంగా గదిలోకి ప్రవేశించినప్పుడు మోహిత్ అహిరే అనే బాలుడు పెళ్లి హాలులోని ఆఫీస్ క్యాబిన్ లోపల మొబైల్ గేమ్‌లో నిమగ్నమై ఉన్నాడు. చిరుత పులి వున్నట్టుండి ఇంటిలోపలికి రాగానే ఆ బాలుడు ఎలాంటి షాక్ లేకుండా మెల్లగా ఫోనుతో బయటికి వెళ్లి డోర్ క్లోజ్ చేశాడు.

ఆ బాలుడు ప్రశాంతంగా అలా చిరుతను చూసి బెదరకుండా మెల్లగా బయటికి వెళ్లి తలుపును మూసేయడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఆ చిరుత బాలుడిని గమనించలేదు. 
 
మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున సమీపంలోని నివాస ప్రాంతంలో చిరుతపులి కనిపించిందని, దీంతో స్థానికులు, పోలీసులు, అటవీశాఖ అధికారులు వెతకగా కళ్యాణ మండపంలోకి వచ్చిందని యజమాని వెల్లడించారు. 
 
చిక్కుకున్న చిరుతపులి గురించి అహిరే తన తండ్రికి సమాచారం అందించాడు. అధికారులు వేగంగా స్పందించారు. మాలెగావ్ శ్రేణికి చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ త్వరగా నాసిక్ సిటీ టీమ్‌తో కలిసి ఐదేళ్ల మగ చిరుతపులిని రక్షించారు. సమీపంలో వ్యవసాయ పొలాలు ఉండటం, నదికి సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు చిరుతపులులు కనిపిస్తున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.