ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (14:20 IST)

కరీబియన్ దీవుల్లో ఆవాసం - కైలాస పేరిట రిజర్వు బ్యాంకు

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి సొంతంగా కైలాస పేరుతో ఓ రిజర్వు బ్యాంకును ఏర్పాటు చేశారు. అత్యాచార ఆరోపణలతో దేశ విడిచి పత్తాలేకుండాపారిపోయిన ఈయన ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో తలదాచుకుంటున్నట్టు సమాచారం.
 
అక్కడ ఓ దీవిని సొంతం చేసుకుని దానికి 'కైలాస' అనే పేరు పెట్టి... ఓ దేశంగా ప్రకటించారు. తన దేశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాస' నెలకొల్పారు. రిజర్వ్ బ్యాంకు అన్న తర్వాత కరెన్సీ ఉండాలి కదా... దాంతో కైలాస దేశముద్రతో నోట్లు, నాణేలు కూడా విడుదల చేశారు. ఈ నాణేలు బంగారంతో తయారైనవని కైలాస దేశాధిపతి నిత్యానంద సెలవిచ్చారు.
 
ఇక, తమ రిజర్వ్ బ్యాంకు విధివిధానాలను కూడా ఆయన వివరించారు. ఏ దేశానికి చెందిన కరెన్సీ అయినా కైలాస దేశంలో చెల్లుబాటు అవుతుందని, తమ కైలాస కరెన్సీ కూడా అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందన్నారు. ఈ మేరకు అనేక దేశాల బ్యాంకులతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఇందులో ఎంతమాత్రం వాస్తవం ఉందనేది భవిష్యత్తులో తేలనుంది.