"ఎవర్ గివెన్" భారీ నౌకను కదిలించిన పున్నమి చంద్రుడు!
సూయెజ్ కాలువులో చిక్కుకున్న భారీ నౌకను టగ్ బోట్లు కదిలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. కానీ, ఆ బోట్లు భారీ నౌకలు ఒక అంగుళం కూడా కదిలించలేకపోయాయి. కానీ, పున్నమి చంద్రుడు ఆ నౌకను నీటిలోకి తోసి.. తన గమ్యస్థానం చేరుకునేందుకు మార్గం చూపించింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల సూయెజ్ కాలువలో భారీ ఎవర్ గివెన్ నౌక చిక్కునిపోయిన విషయం తెల్సిందే. 1300 ఫీట్ల వెడల్పు ఉన్న ఆ నౌకను కదిలించేందుకు.. మహా యంత్రాంగమే రంగంలోకి దిగింది. అడ్డంగా చిక్కుకున్న నౌక వల్ల వేల కోట్ల రూపాయల వ్యాపారం స్తంభించిపోయింది.
ఆ నౌకను మళ్లీ దారిలో పెట్టేందుకు ఊహించని స్థాయిలో డ్రెడ్జింగ్ చేపట్టారు. టగ్ బోట్లతో ఆ సరుకు నౌకను కదిలించే ప్రయత్నమూ చేశారు. కానీ ఆ ఇంజినీర్ల కృషి పనిచేయలేదు. కానీ, ప్రకృతి కరుణించడంతో ఆ భారీ నౌక తిరిగి గాడిలో పడింది.
సాధారణంగా పున్నమి రోజున ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. ఆదివారం సూపర్‌మూన్ కావడంతో.. భారీ అలలు వచ్చాయి. డ్రెడ్జింగ్‌కు అలలు తోడుకావడంతో.. ఎవర్ గివెన్ నౌక సముద్ర నీటిలో ఈజీగా తేలినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పున్నమి చంద్రుడే వల్లే నౌక కదిలిందన్న ఊహాగానాలు బలపడుతున్నాయి.
సూయెజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక కదిలినా.. అసలు ఆ నౌక ఎందుకు అక్కడ అలా చిక్కుకుపోయిందో తెలుసుకునేందుకు ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎవర్ గివెన్ నౌక స్తంభించడం వల్ల సుమారు 369 బోట్లు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. మధ్యదరా, ఎర్ర సముద్రంలో ఆ నౌకలు ఆగిపోయాయి. అవన్నీ క్లియర్ అయ్యేందుకు మరింత సమయం పడుతుంది.