Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోధ్‌పూర్ అబ్బాయి-పాకిస్థాన్ అమ్మాయి.. ఆన్‌లైన్‌లో డుం.. డుం.. డుం..

Written By సెల్వి
Updated: సోమవారం, 7 ఆగస్టు 2023 (12:48 IST)
Pakistan Woman
సరిహద్దులు దాటుకుని ప్రేమ పుట్టడం మామూలే. ఆ ప్రేమ కోసం సరిహద్దులు దాటి పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన అమీనా అనే మహిళ భారతదేశంలోని రాజస్థాన్‌కు చెందిన అర్బాజ్ అనే యువకుడితో వివాహం చేసుకుంది. 
 
దాయాది దేశాలకు చెందిన యువత సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేమించి.. ఆపై సరిహద్దులు దాటుకుని.. ప్రేమించిన వ్యక్తులనే వివాహం చేసుకోవడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. అయితే తాజాగా పాక్ అమ్మాయి- జోధ్ పూర్ అబ్బాయి అమీనా-అర్బాజ్ జంట పెళ్లి ద్వారా ఒక్కటైంది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. 
 
ఇందులో విశేషమేమిటంటే, వారి వివాహం ఆన్‌లైన్‌లో ప్రత్యేకంగా వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన అర్బాజ్, పాకిస్థానీ పెళ్లికూతురు అమీనాతో వర్చువల్ వేడుక ద్వారా ప్రమాణం చేసుకున్నారు. వివాహానికి భారతీయ వీసాను అమీనా పొందలేకపోవడంతో వివాహాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
 
డిజిటల్ సెట్టింగ్ ఉన్నప్పటికీ అన్ని సాంప్రదాయ ఆచారాలను స్వీకరించి బుధవారం సాయంత్రం ఈ వేడుక వైభవంగా జరిగింది. ఈ వివాహం భారత్-పాకిస్థాన్ ముస్లిం పెద్దల మధ్య జరిగింది. ఇంకా ఈ వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు కూడా హాజరయ్యారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments