'బట్టలు విప్పి మాట్లాడుకుందాం'.. నిజాలు నిగ్గుతేలుద్దాం : పవన్ వరుస ట్వీట్స్

జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లతో బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటివరకూ పవన్ ఏ విషయంపైనా స్పందించడం లేదని బాధ పడుతున్న ఫ్యాన్స్‌కు తన ట్వీట్స్‌తో ఉత్సాహం నింపుతున్నారు. ఒక ట్వీట్‌లో బట్టలు వి

శనివారం, 21 ఏప్రియల్ 2018 (10:38 IST)
జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లతో బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటివరకూ పవన్ ఏ విషయంపైనా స్పందించడం లేదని బాధ పడుతున్న ఫ్యాన్స్‌కు తన ట్వీట్స్‌తో ఉత్సాహం నింపుతున్నారు. ఒక ట్వీట్‌లో బట్టలు విప్పి మాట్లాడుకుందాం అన్న పవన్ మరో ట్వీట్‌లో ఒక మంత్రి, ముఖ్యమంత్రి, ఒకరు ఎవరు? తెలుసుకోవాలని ఉందా? అంటూ సంచలన ట్వీట్ చేశారు. పవన్ వరుస ట్వీట్స్.. ఆయన మాటల్లోనే..
 
"స్టే ట్యూన్డ్ టు 'బట్టలు విప్పి మాట్లాడుకుందాం' ప్రోగ్రాం నుంచి పవన్ కల్యాణ్ విత్ కెమెరామెన్ ట్విటర్. ఒక రాష్ట్ర కేబినెట్ ర్యాంక్ మంత్రి స్వయానా ఈ 'అజ్ఞ్యాతవాసి'ని వాడో బ్లాక్ మెయిలర్ అని స్వయానా ముఖ్యమంత్రిగారు అన్నారని 'ఒకరి'తో అన్నారు. ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, 'ఒకరు' ఎవరు.. తెలుసుకోవాలని ఉందా!! 
 
స్టే ట్యూన్డ్! లైవ్ ఫ్రం హైదరాబాద్! 'నిజాల నిగ్గు తేలుద్దాం' ప్రోగ్రాం నుంచి మీ పవన్ కల్యాణ్. నాకు ఇష్టమైన స్లోగన్ "‘ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చెయ్యాలి" అసలు ఈ స్లోగన్ వెనుక కథకి ఈ స్లోగన్‌కి సంబంధం ఏంటి? నిజమైన 'అజ్ఞ్యాతవాసి' ఎవరో మీకు తెలుసా?’’ అంటూ వరుస ట్వీట్స్ చేశారు పవన్ కల్యాణ్. మొత్తంమీద శుక్రవారం నుంచి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కథన రంగంలోకి దిగారు. 

అన్నీ చూడండి

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్

తర్వాతి కథనం
Show comments