సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 27 మే 2022 (10:58 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 'వైఎస్సార్ ప్రదేశ్'గా పేరు మార్చండి ప్లీజ్, ఎవరు?

ysrcp
కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తొలుత కోనసీమ జిల్లా అని ప్రకటించి ఆ తర్వాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడంతో ఆందోళనలు భగ్గుమన్నాయి.

 
ఇదిలావుంటే ఏపీ పేరును వైఎస్సార్ ప్రదేశ్‌గా మార్చాలంటూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపము అంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు వ్యంగ్యంగా ట్వీట్ చేసారు. తెలుగు భాషను తెగులుగా భావించి దాన్ని పీకేస్తున్నాం కాబట్టి రాష్ట్రానికి వైఎస్ఆర్ ల్యాండ్ అని ఇంగ్లీషులో నామకరణం చేస్తే భేషుగ్గా వుంటుందంటూ ఆయన ట్వీట్ చేసారు.