Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీనామాకు ఇమ్రాన్ ఖాన్ ససేమిరా.. పాక్ పార్లమెంట్ రద్దు!

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (14:28 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయేందుకు సిట్టింగ్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ససేమిరా అన్నారు. పైగా, పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ ఆయన పాక్ అధ్యక్షుడికి సిఫార్సు చేశారు. దీంతో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆ దేశ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. 
 
అంతకుముందు ఆయన తన సర్కారుపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రసంగం చేశారు. "అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షుడికి లేఖ రాశాను. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ ప్రజలకు పిలుపునిస్తున్నాను" అని ఇమ్రాన్ సభలో ప్రకటించారు. 
 
పైగా, సాఫీగా పరిపాలన చేస్తున్న తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు విపక్షాలు కుట్రపన్ని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని ఆరోపించారు. తన సర్కారును కూల్చివేసి విపక్ష పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మళ్లీ అదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఇమ్రాన్ భావించారు. 
 
అందుకే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహించి, అవిశ్వాసం ఓటింగ్‌కు రాకుండానే జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు కూడా ఇమ్రాన్ ఖాన్ ఆలోచనతో ఏకీభవించి అసెంబ్లీని రద్దు చేశారు. 

అన్నీ చూడండి

Vikranth: హారర్ కామెడీ చిత్రంలో హీరో విక్రాంత్

Sam C.S : సామ్ సి. ఎస్. 39వ పుట్టినరోజు 100వ సినిమా మైలురాయి

NTR: ఐ యామ్ గేమ్ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది: ఎన్టీఆర్

Sumanth: న్యూటన్స్ థర్డ్ లా ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది: సుమంత్

MS Raju: అక్కడకు వెళితే దెయ్యాలున్నాయనే వైబ్రేషన్ కు గురయ్యా: ఎంఎస్ రాజు

తర్వాతి కథనం
Show comments