ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మే 2023 (09:58 IST)

అక్కడ అలా మెరిసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఆర్జీవీ ఒక్కమగాడు...?

junior NTR
టాలీవుడ్ సంచలనం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించింది. వారిని చూసిన అభిమానులు ఫోటోలు తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ విహారయాత్ర కోసం హైదరాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. భార్య లక్ష్మీప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్‌లతో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. ప్రస్తుతం వీరి ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మే 28 సీనియర్ ఎన్టీఆర్ జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడంపై చర్చ మొదలైంది. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. టీడీపీ నేత చంద్రబాబు ఎలాంటి వాడు అనేది స్వయంగా ఎన్టీఆర్ చెప్పారు. లక్ష్మీ పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారు అంటుంటారు. అంటే ఎన్టీఆర్‌కు అవగాహన లేదా? అవగాహన లేని వ్యక్తికి దండలు ఎందుకు వేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. 
 
చంద్రబాబు పక్కన రజనీకాంత్ కూర్చుని ఎన్టీఆర్‌ను పొగడటం అంటే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవటమేనని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అయితే ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళతో పాటు వేదిక పంచుకోకుండా ఒక విధానానికి కట్టుబడి ఉన్నాడని కామెంట్లు చేశాడు.