Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఎవరు గెలుస్తారో తెలుసు.. కానీ చెప్పను: 'జనసేన'పై రేణూ దేశాయ్ షాకింగ్ కామెంట్స్

Updated: గురువారం, 3 జనవరి 2019 (12:38 IST)
తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి అక్కడి ప్రజలు తిరుగులేని మెజారిటీ కట్టబెట్టి ప్రతిపక్ష పార్టీలను నడ్డి విరగ్గొట్టారు. దాంతో ఇప్పుడు చర్చంతా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై పడింది. ఇక్కడ పాలక పార్టీ తెలుగుదేశం పార్టీతో పాటుగా జగన్ మోహన్ రెడ్డి వైసీపి, పవన్ కల్యాణ్ జనసేన పార్టీలతో పాటు జాతీయ పార్టీలు కూడా రంగంలో వుండబోతున్నాయి. ఐతే జనసేన పార్టీ అనగానే నటుడు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుకోక తప్పదు. ఇప్పుడదే రేణూ దేశాయ్ విషయంలోనూ జరిగింది.
 
ఆమె ఎక్కడ... ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా ఖచ్చితంగా ఆమెకు పవన్ కల్యాణ్, జనసేన పార్టీల గురించిన ప్రశ్నలు ఎదురవుతాయి. అలాగే ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలోనూ ఆమె దీనిపై మాట్లాడక తప్పలేదు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ముందే ఊహించానని చెప్పుకొచ్చారు. మరి ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ... అధికారంలోకి ఎవరు వస్తారో నాకు తెలుసు... కానీ నేనిప్పుడు చెప్పను అని షాక్ ఇచ్చారు.
 
అంతేకాదు... రాజకీయాల విషయానికి వస్తే తను కూడా జనసేన పార్టీ కుటుంబానికే చెందినదాన్నని మరింత షాకిస్తూ చెప్పేశారు. ఇక పవన్ కల్యాణ్ గారి విషయానికి వస్తే... ఆయన కేవలం నా ఇద్దరి పిల్లల తండ్రిగా మాత్రమే గుర్తిస్తానని వెల్లడించారు. మొత్తమ్మీద రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలను చూస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేస్తారేమోనన్న అనుమానం కలుగుతోంది. రేణూ కామెంట్లతో పవన్ ఫ్యాన్స్ యమ జోష్‌లో వున్నారు.

అన్నీ చూడండి

Rambha Urvasi Menaka..Review : రంభ, ఊర్వశి, మేనక చిత్రంతో అల్లరి నరేష్ గట్టెక్కాడా? రివ్యూ రిపోర్ట్

Hanuman Ansh: కాంతార, ది కాశ్మీర్ ఫైల్స్‌ను వెనక్కి నెట్టిన హనుమాన్ అన్ష్

ఏవియేషన్ రంగం నుంచి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్న ప్రార్థనా చాబ్రియా

మహిళల భావోద్వేగాల అంశంతో హ్యాపీ జర్నీ చిత్రం విడుదలకు సిద్ధం

Allu Aravind: అల్లు అర‌వింద్ పై యశ్ మ‌ద‌ర్ విమర్శించడంలో పసలేదు

తర్వాతి కథనం
Show comments