బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (13:27 IST)

షకీలా 250వ సినిమా.. ''శీలవతి'' అనే పేరు పెట్టకూడదా? ఎందుకండీ?

అడల్ట్ మూవీ స్టార్ షకీలా తన 250వ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు ముందుగానే చుక్కలు చూపించారు. ఈ చిత్రానికి ''శీలవతి'' అని పేరు పెట్టడం వల్లే షకీలాకు కష్టాలు మొదలయ

అడల్ట్ మూవీ స్టార్ షకీలా తన 250వ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు ముందుగానే చుక్కలు చూపించారు. ఈ చిత్రానికి ''శీలవతి'' అని పేరు పెట్టడం వల్లే షకీలాకు కష్టాలు మొదలయ్యాయి. ఈ చిత్రం టైటిల్ మార్చేయాలని.. అప్పుడే సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తామని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. అసలు సినిమా కూడా చూడకుండా అభ్యంతరాలు ఎలా చెబుతారని షకీలా సోషల్ మీడియాలో వీడియో ద్వారా మండిపడింది. 
 
షకీలా సినిమాకు శీలవతి అనే పేరు వుండకూడదని సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పారట. అది ఎందుకో తనకు తెలియదని.. తన పాత డబ్బింగ్ సినిమాకు కూడా అదే పేరు వుందని షకీలా గుర్తు చేసింది. ఆ టైటిల్‌ను మార్చే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పేసింది. ఈ నెలలోనే సినిమాను రిలీజ్ చేయాలని భావించినట్లు షకీలా చెప్పింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తరువాత టైటిల్ మార్చమంటే ఎలా అని ప్రశ్నించింది.