Biodata Maker
✕

#BabaRamdev ఏనుగు మీద యోగా గురువు, బిళ్లబీటున కింద పడ్డాడు- video

Written By ఐవీఆర్
Updated: మంగళవారం, 13 అక్టోబరు 2020 (23:14 IST)
ఏ పనైనా ఎప్పటిలా మామూలుగా చేస్తే ఏముంటుంది? అసలే డిజిటల్ కాలం. ఏదో వెరైటీ చేస్తేనే ఏదైనా జనంలోకి దూసుకుని వెళుతుంది. బాబా రామ్‌దేవ్ కూడా అదే చేసారు. ఆయన ఇప్పుడు కాదు... ఎప్పటి నుంచి యోగాతో కొత్త ప్రయోగాలు చేస్తూ కుస్తీలు పడుతూనే వున్నారు.

అందులో భాగంగా మధురలో, బాబా రామ్‌దేవ్ ఏనుగుపై కూర్చొని యోగా చేస్తున్నాడు, కానీ ఏనుగుకి ఆ యోగాలో తేడా అనిపించిందో లేక దానికి వీపు మీద ఏదైనా కుట్టిందో ఇంకేమైనా జరిగిందో కానీ ఒక్కసారిగా అటుఇటూ కదలింది. అంతే... యోగా బాబా రాందేవ్ బ్యాలెన్స్ కోల్పోయి ఏనుగు పైనుంచి బిళ్లబీటున కిందపడ్డాడు. ఇప్పుడీ వీడియో సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది.
 
 
ఏనుగు పైనుంచి బాబా రాందేవ్ కిందపడటంతో అక్కడివారంతా భయపడ్డారు. కాని బాబా త్వరగా లేచాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా ఎగతాళి చేస్తున్నారు. బాబా రామ్‌దేవ్‌పై ప్రజలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి ముందే, టీవీ ఛానల్ కార్యక్రమంలో సైకిల్ నడుపుతున్నప్పుడు బాబా రామ్‌దేవ్ పడిపోయాడు. అప్పుడు సైకిల్ పైనుంచి పడ్డారు ఇప్పుడు ఏనుగు అంటూ కామెంట్లు జోడిస్తున్నారు.
 

అన్నీ చూడండి

Supriya: #బాలుగీత అందరికీ రిలేట్ అయ్యే సినిమా : సుప్రియ యార్లగడ్డ

Niharika Konidela: పాకెట్ రాకెట్స్ తో మేమంతా మీ సోషల్ మీడియా, మీ ఇంట్లోకి వచ్చేస్తాం - నిహారిక కొణిదెల‌

V.V. Vinayak: వీవీ వినాయక్ ప్రారంభించిన కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం

Naga Chaitanya: వృషకర్మ కోసం నాగ చైతన్య 'స్వాగ్ ఆఫ్ అర్జున్' సింగిల్‌ను ఆవిష్కరించారు

NTR Trailer: ఎన్టీఆర్ లాంచ్ చేసిన ఇట్లు అర్జున ట్రైలర్‌

తర్వాతి కథనం
Show comments