Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

KCR దంపతుల అద్భుత చిత్రం- కేటీఆర్, హిమాన్షు హర్షం.. నెట్టింట వైరల్

Written By సెల్వి
Updated: గురువారం, 3 జూన్ 2021 (16:38 IST)
KCR-Shoba
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన సతీమణి శోభా దంపతుల పెన్సీల్ స్కెచ్ పెయింటింగ్  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటో పట్ల వారి మనమడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు హర్షం వ్యక్తం చేశారు.
 
పెయింటింగ్ అద్భుతంగా ఉందంటూ సంబరపడిపోయారు. పెయింటింగ్ గీసిన వారికి హిమాన్షు థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఆ ఫోటోను హిమాన్షు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణ శోభ చిరునవ్వులు చిందిస్తూ ముచ్చటిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫోటోకు లైకుల వర్షం కురుస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. కేసీఆర్ దంపతుల పెన్సీల్ స్కెచ్ పెయింటింగ్‌ను కరీంనగర్‌కు చెందిన కలికోట వెంకటాచారి వేశారు. పెన్సీల్‌తో గీసిన ఈ ఆర్ట్‌ను తొలుత కలికోట వెంకటాచారి ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఆ తరువాత యర్రోజు చందు అనే వ్యక్తి ఆ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షుకు ట్యాట్ చేస్తూ రీట్వీట్ చేశారు. 
 
దాంతో ఆ పెన్సీల్ ఆర్ట్ కాస్తా హిమాన్షు కంట పడటంతో వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ పెయింట్ అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ఆ పెయింటింగ్‌ను హిమాన్షు సైతం రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

అన్నీ చూడండి

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

తర్వాతి కథనం
Show comments