Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఆడపిల్లల్ని కాల్చుకుతినే బ్రోకర్లు వాళ్ళు.. అందుకే ఈ గతి-మాపై శ్రీరెడ్డి ఫైర్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన సొమ్ము దుర్వినియోగం అయ్యిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టాలీవుడ్ సెన్సేషనల్ శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్‌పై మండిపడుతూ.. వెరైటీగా పో

Written By selvi
Updated: గురువారం, 6 సెప్టెంబరు 2018 (13:05 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన సొమ్ము దుర్వినియోగం అయ్యిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టాలీవుడ్ సెన్సేషనల్ శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్‌పై మండిపడుతూ.. వెరైటీగా పోరాటం చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం కోలీవుడ్ వైపు మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో ''మా''కి సంబంధించిన ప్రజల సొమ్ముని అధ్యక్షుడు శివాజీరాజా కొందరు సభ్యులతో కలిసి దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై శ్రీరెడ్డి మండిపడింది. 
 
శివాజీ రాజాపై ఆరోపణలు చేస్తూ కౌంటర్ ఎటాక్‌గా మా ప్రధాన కార్యదర్శి నరేష్ మరో ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసి నిజాలను బయటపెట్టే ప్రయత్నాలు చేశారు. శ్రీరెడ్డి విషయంలో కూడా శివాజీరాజా సొంత నిర్ణయాలు తీసుకున్నారని, మా తీరుని తప్పుబట్టారు.
 
తాజాగా నరేష్ వ్యాఖ్యలపై స్పందించిన నటి శ్రీరెడ్డి.. శివాజీరాజాపై మండిపడింది. తాను చేస్తున్న పోరాటాన్ని శివాజీ రాజా, శ్రీకాంత్ ఇద్దరూ పబ్లిసిటీ స్టంట్ అన్నారని ఎత్తిచూపింది. అందుకే వారికి ప్రస్తుతం దరిద్రపు గతి పట్టిందని దుమ్మెత్తిపోసింది. తాను మోసపోయి వస్తే ఓదార్చిల్సిందిపోయి.. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలని కాపాడే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు. 
 
తనకు కోట్ల రూపాయలు ఇవ్వాలని శివాజీరాజా అతడి తొత్తులు ప్రయత్నం చేస్తే.. తాను తీసుకోలేదని చెప్పింది. తన విషయంలో శివాజీరాజా ప్రవర్తన బాధాకరమని శ్రీరెడ్డి తెలిపింది. ఆడపిల్లల్ని కాల్చుకుతినే బ్రోకర్లు వాళ్ళు. సెటిల్మెంట్స్ చేసే గూండాలు. అందరూ తోడుదొంగలే.. ఆ డబ్బంతా పంచుకొని తిన్నారు. ఆ మొత్తంలో ఓ బడా హీరో వాటా చాలా పెద్ద మొత్తం. అమెరికాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉందంటూ శ్రీరెడ్డి సంచలన కామెంట్లు చేసింది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments