ఎంపీ కవిత సినిమాల గురించే మాట్లాడతారే కానీ?: శ్రీరెడ్డి

టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు జంప్ అయ్యానని... అక్కడే మకాం మార్చేస్తానని చెప్పుకొచ్చిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ బాంబు పేల్చింది. ఎంపీ కవిత కూడా మహేష్ బాబు, విజయ్ దేవరకొండ సినిమాల గురించే మాట్లాడతా

బుధవారం, 19 సెప్టెంబరు 2018 (11:28 IST)
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు జంప్ అయ్యానని... అక్కడే మకాం మార్చేస్తానని చెప్పుకొచ్చిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ బాంబు పేల్చింది. ఎంపీ కవిత కూడా మహేష్ బాబు, విజయ్ దేవరకొండ సినిమాల గురించే మాట్లాడతారు కానీ మహిళల అంశాలను పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోందని శ్రీరెడ్డి కామెంట్లు చేసింది. 


సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కంటే.. ఆర్థిక అంశాలకే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని.. ఇది మహిళలను అవమానించినట్టే అవుతుందని మీడియా సమావేశంలో వెల్లడించింది. 
 
ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో జరిగిన గొడవల గురించి ప్రస్తావిస్తూ.. ఆర్ధిక లావాదేవీలపై శివాజీరాజా, నరేష్ మధ్య వివాదం చెలరేగడం, తరువాత రెండు రోజులకే సమస్య పరిష్కారమైందని చెప్పడం చూస్తుంటే ఆర్ధిక అంశాలే కీలకమైనవనే అభిప్రాయం కలుగుతుందని శ్రీరెడ్డి చెప్పింది. శ్రీరెడ్డితో జరిగిన ఇదే ప్రెస్‌మీట్లో పాల్గొన్న మరోనటి అపూర్వ.. నిరసన చేపట్టిన కళాకారులకు అవకాశాలు ఇవ్వకపోవడం బాధగా ఉందని తెలిపింది. 
 
మరోవైపు టాలీవుడ్‌లో లైంగిక దోపిడీ నివారణకు కమిటీ వేయాలని సినీ నటి శ్రీరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసింది. సినిమాటోగ్రఫీ, మహిళాభివృద్ది, మహిళా కమిషన్, కార్మిక శాఖ, తెలంగాణ డీజీపీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.

లైంగిక దోపిడీ అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అయినా మహిళా కమిషన్ ఏం చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయ సేవాధికార సంస్థ సేవలు వినియోగించుకోవాలని కోర్టు సూచించింది.

అన్నీ చూడండి

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం