శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2019 (13:06 IST)

ఆయనకు ఒక్క రోజు భార్యగా వుంటే చాలు.. శ్రీ రెడ్డి

వైకాపాకు చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి తన ప్రేమను వ్యక్తం చేసింది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఒక్కరోజు భార్యగా వున్నా చాలని, ఆ తర్వాత చనిపోయినా ఫర్వాలేని ఫేస్‌బుక్ అకౌంట్‌లో శ్రీరెడ్డి పోస్టు చేసింది. ఈ వైరల్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తద్వారా ఎప్పుడూ సినీ ప్రముఖులపై పడే శ్రీరెడ్డి రూటు మార్చి రాజకీయ నేతలపై పడింది. 
 
శ్రీరెడ్డి తాజా పోస్టు వైసీపీ సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా విభాగం నాయకులు పెద్ద ఎత్తున ఆమెను ట్రోల్ చేస్తున్నారు. బైరెడ్డికి రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించొద్దని చెబుతున్నారు. 
 
తమ నాయకుడిపై ప్రేమను వ్యక్తం చేయడాన్ని పలువురు నాయకులు స్వాగతిస్తుండగా.. మరి కొందరు ఆయనను వదిలేయ్ తల్లో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను ట్రై చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. అంతేకాదండోయ్.. శ్రీరెడ్డి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ప్రేమను వ్యక్తం చేయడంతో.. ఆయనెవరో తెలుసుకునేందుకు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.