Daily Horoscope
✕

గుంటూరులో వింత పురుగులు... ఒంటిపై వాలితే దురద, దద్దుర్లు

Written By ఎం
Updated: మంగళవారం, 23 మార్చి 2021 (18:25 IST)
గుంటూరు జిల్లా రొంపిచర్లలో ప్రజలు వింత పురుగులను చూసి టెన్షన్ పడుతున్నారు. 
రొంపిచర్ల మండలంలో పలు గ్రామాల్లో ఈ పురుగులు సంచరిస్తున్నాయి. ఆ పురుగులు ఒంటిపై వాలినా.. కుట్టినా దురదలు, దద్దుర్లు వస్తున్నాయని వీరవట్నం సుబ్బయ్యపాలెం, విప్పర్లపల్లి గ్రామాల్లో ప్రజలు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
 
వెంటనే దీనికి సంబంధించిన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ పురుగుల దెబ్బకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుబాబుల్ తోటల వల్లే పురుగులు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.
 
గతంలో ఎప్పుడూ ఇలాంటి వాటిని చూడలేదని రైతులు కూడా చెబుతున్నారు. ఈ పురుగులు ఏంటి, ఎక్కడ్నుంచి వచ్చాయన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతున్న ఆ పురుగుల్ని పరిశీలిస్తున్నారు.

అన్నీ చూడండి

తిరువీర్‌కు శ్రీమతిగా నివేదా థామస్ ట్రైలర్ రిలీజ్

Dimple, Sharwa: డింపుల్ హయాతికి శర్వానంద్ ఎందుకు పెద్దపీట వేశాడో తెలుసా

Pujita Ponnada : త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూజిత పొన్నాడ సంచలన వ్యాఖ్యలు

Allu Arjun-s family dinner :అల్లు అర్హ పదో పుట్టిన రోజు శ్రీలంకలో అల్లు అర్జున్ ప్రత్యేక వేడుకలు

సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా : నిత్యా మేనన్

తర్వాతి కథనం
Show comments