ఆరో అంతస్తు నుంచి తలకిందులుగా యోగా ఫోజ్.. ఏమైందంటే?

బుధవారం, 28 ఆగస్టు 2019 (15:12 IST)
యోగా కోసం 80 అడుగుల ఎత్తుతో కూడిన భవనంలో తలకిందులుగా నిలబడిన యువతి దారుణంగా గాయాలపాలైంది. యోగా చేస్తానని.. తలకిందులు నిలబడిన ఆ యువతి అదుపుతప్పి జారిపడటంతో తీవ్ర గాయాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది.  ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని ఓ కాలేజీలో చదువుతున్న 23 ఏళ్ల యువతి అలెక్సా థెరిసా. 
 
ఈమె ఆరో అంతస్తు బాల్కనీ నుంచి తలకిందులుగా యోగా చేస్తానని స్నేహితులతో చెప్పింది. దీన్ని వీడియో తీయాల్సిందిగా స్నేహితులకు చెప్పింది. కానీ అదుపు తప్పి బాల్కనీ కమ్మీ నుంచి కిందపడిపోయింది. 
 
8వ అంతస్తు నుంచి కిందపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తలకిందులుగా 8వ అంతస్తు నుంచి కిందపడటంతో ఆమె శరీరంలోని 110 ఎముకలు విరిగిపోయాయి.

వెన్నెముక, నడుము, తలకు భారీ గాయాలైనాయి. థెరిసా పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. ఇకపోతే.. థెరిసా స్నేహితురాలు.. ఆమె యోగా చేస్తున్నప్పుడు తీసిన ఫోటోను నెట్టింట్లో షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అన్నీ చూడండి

Nagabandham Review: సనాతన ధర్మం కోసం తీసినా ఆకట్టుకోని నాగబంధం మూవీ రివ్యూ

జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ ఇమ్మోర్టల్ నుంచి రాకాసి సాంగ్

Rajamouli: ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ లూమియర్ వారి 'వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేకర్స్'లో ఎస్.ఎస్. రాజమౌళి పేరు

జగపతి బాబు, లయ నటించిన వదలా చిత్రం రిలీజ్ కు సిద్ధం

Mythri Movie Makers: ధృవ్ విక్రమ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం

తర్వాతి కథనం
Show comments