సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 అక్టోబరు 2021 (21:47 IST)

ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్, ఏమైంది?

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్ 28న సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నటుడు రజనీకాంత్ చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు.

 
"ఇది రెగ్యులర్‌గా చేసే ఆరోగ్య పరీక్ష. ఆయన ప్రస్తుతం చెకప్ కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు" అని నటుడు ప్రచారకర్త రియాజ్ కె అహ్మద్ పిటీఐతో చెప్పారు. రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సదరు వార్తా సంస్థ తెలిపింది. 

 
70 ఏళ్ల నటుడు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడానికి ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వచ్చారు. దేశ రాజధానిలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీని కూడా సందర్శించారు.