శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 5 ఏప్రియల్ 2021 (22:07 IST)

'గే' పెళ్లిళ్లతో కరోనావైరస్ పుట్టింది, ఎవరు?

కరోనావైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే దానిపై ఇప్పటికే చాలామంది అనేక రకాల కారణాలు చెప్పారు. ఇంకా చెపుతూనే వున్నారు. తాజాగా మరో వ్యక్తి కరోనావైరస్ పుట్టుకకు కారణం స్వలింగ సంపర్కుల వివాహమేనని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
 
వివరాలలోకి వెళితే.. స్కాంట్లాండుకు చెందిన పీటర్ అనే రాజకీయ నాయకుడు నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. ఇటీవల ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో అతి తక్కువ ఓట్లు దక్కించుకున్న వ్యక్తిగా పేరు రావడంతో ఆయనను ఇంటర్వ్యూ చేసింది మీడియా.
 
రాజకీయ వ్యాఖ్యలు ముగిశాక కరోనావైరస్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ కరోనావైరస్ అనేది తనకున్న మత సంబంధమైన విశ్వాసాల ప్రకారం చూస్తే గే పెళ్లిళ్ల కారణంగానే అది పుట్టింది. నా వ్యాఖ్యలపై దుమారం రేగవచ్చు. కానీ ఇది వాస్తవం అని నేను గట్టిగా చెప్తాను అని చెప్పారు. ఆయన అన్నట్లుగానే ఆ వ్యాఖ్యలపై దుమారం రేగింది.