Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ బుడ్డోడు నా మనసు దోచాడు.. కేటీఆర్ ట్వీట్

Written By సెల్వి
Updated: శనివారం, 14 నవంబరు 2020 (16:00 IST)
Boy
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌కు చిన్నారులంటే చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో తెలిపారు. ఇక 14 నవంబర్ 2020 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేటీఆర్.. ఆసక్తికరమైన ఫోటోను పోస్టు చేశారు. 
 
ఇంకా ఆ ఫోటో ద్వారా ప్రపంచంలో తనకు పిల్లలంటేనే చాలా ఇష్టమని చెప్పారు. నవ్వుతున్న కళ్లతో నవ్వుతున్న ముఖాలు అంటూ పలు ఫోటోలను పంచుకున్న ఆయన.. సనత్‌ నగర్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తన్న సమయంలో ఓ చిన్నారి స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకొని కేటీఆర్‌ను ఫోటో తీస్తున్న ఫోటోను షేర్ చేశారు.
 
ఈ ఫోటోను అంతకుముందు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తన ట్విటర్‌ పోస్టు చేయగా.. అదే ఫోటోను కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 'ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు. నిన్న సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించాను. పలు వేదికలపై మాట్లాడాను. 
 
ఆ బాలుడు ఈ ఫొటోను ఎక్కడ తీశాడో కచ్చితంగా తెలియదు. కానీ, ఈ చిన్నారి బాగా ఫోకస్ పెట్టి ఫోటో తీశాడు' అంటూ కేటీఆర్ స్మైలీ ఎమోజీని పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

అన్నీ చూడండి

టైమ్స్ స్క్వేర్‌లో జెండా ఎగురవేతకు ముఖ్య అతిథిగా బుట్టబొమ్మ.. డ్యాన్స్ అదుర్స్ (video)

పవన్ కళ్యాణ్ గారు మోదీ ని కలిసినప్పుడు నేనిచ్చిన స్కోర్ నచ్చి పిలిపించారు : అజయ్ అరసాడ

Anirudh and Kavya : గ్రీస్ లో అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం జరగనుందా ?

Nidhhi Agerwal: పుట్టినరోజున కొత్త చిత్రాన్ని ప్రారంభించిన నిధి అగర్వాల్

పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమి చేస్తుంది ?

తర్వాతి కథనం
Show comments