బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (22:47 IST)

ఉలవపాడు-కావలి మధ్య గంటకు 120 కి.మీ వేగంతో దుమ్ములేపుతూ వెళ్లిన రైలు

విజయవాడ రైల్వే డివిజిన్ పరిధిలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడవబోతున్నాయి. శనివారం నాడు ఉలవపాడు-కావలి మధ్య గంటకు 120 కిలోమీటర్లు వేగంతో ప్రత్యేక రైలు దుమ్ము లేపుతూ దూసుకెళ్లింది. ట్రైల్ రన్ సక్సెస్ అయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్లో వెల్లడించారు.
 
కాగా గత కొన్నిరోజులుగా ఉలవపాడు-కావలి మధ్య మూడో రైల్వే పనులను శరవేగంగా పూర్తి చేసారు. సాయంత్రం ఉలవపాడు నుంచి బయలుదేరిన రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పట్టాలపై పరుగులు తీసింది. అదేసమయంలో రెండో లైనుపై వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు వేగాన్ని అధిగమించి ప్రత్యేక రైలు పరుగులు తీయడాన్ని వీడియోలో చూడవచ్చు.