ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 27 మార్చి 2021 (13:34 IST)

అభినవ హరిశ్చంద్రులంటే వీరే... రూ. 6 కోట్లు వచ్చినా ఆడిన మాట తప్పలేదు

ఈరోజుల్లో డబ్బు వస్తుందంటే.. అన్నీ మరిచిపోయి వాటిని ఎలా నొక్కేయాలా అని కొంతమంది చూస్తుంటారు. ఐతే మరికొందరు మాత్రం తాము ఇచ్చిన మాటకు కట్టుబడి నిజాయితీగా వుంటారు. అలా నిజాయితీకి మారుపేరుగా నిలిచారు కేరళ రాష్ట్రానికి చెందిన ఓ జంట.
 
పూర్తి వివరాలు చూస్తే... కేరళ లోని ఎర్నాకుళంలోని వలంబుర్‌కక్కనాడ్‌కు చెందిన స్మిజా, రాజేశ్వరన్ దంపతులు లాటరీ టిక్కెట్లు విక్రయిస్తుంటారు. ఎప్పటిలాగే గత ఆదివారం నాడు కూడా టిక్కెట్లు అమ్మారు. కానీ వాటిలో 12 టిక్కెట్లు మిగిలిపోయాయి. దాంతో వీటిని అమ్మాలని చూసినా ఎవరూ కొనడంలేదు. దాంతో తమ వద్ద నిత్యం టిక్కెట్లు కొనేవారికి ఫోన్ చేసి టిక్కెట్లు మిగిలాయి తీసుకుంటారా అని అడిగారు.
 
ఐతే పాలచోటిల్‌కు చెందిన చంద్రన్ తన వద్ద డబ్బు లేదనీ, మరుసటి రోజు ఇస్తానని ఓ టికెట్ తనకు ఇవ్వమని చెప్పాడు. మరుసటి రోజు లక్కీడ్రా తీయగా అతడు చెప్పిన టిక్కెట్ నెంబరుకు ఏకంగా రూ. 6 కోట్లు వచ్చాయి. నీ నెంబరుకి రూ. 6 కోట్లు వచ్చాయని చంద్రన్ ఇంటికి వెళ్లి ఆ టెక్కెట్ ఇచ్చి రూ. 200 టిక్కెట్ రుసుము తీసుకుని వచ్చారు ఆ దంపతులు. వారి నిజాయితీకి ఇప్పుడు అంతా హ్యాట్సాప్ చెపుతున్నారు.