Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికాగో వ్యభిచారం దందా వెనుక తెలుగు తమ్ముళ్లు : వాసిరెడ్డి పద్మ

ఇటీవల అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందా వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఉన్నారని వైకాపా ఎమ్మెల్యే వాసిరెడ్డి పద్మ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఈ వ్యభి

Written By pnr
Updated: గురువారం, 21 జూన్ 2018 (18:16 IST)
ఇటీవల అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందా వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఉన్నారని వైకాపా ఎమ్మెల్యే వాసిరెడ్డి పద్మ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఈ వ్యభిచార దందాను టీడీపీలోని వ్యక్తులు, ఆ పార్టీలోని సన్నిహితులు నడుపుతున్నారని ఆరోపించారు. 
 
ఈ వ్యభిచార రాకెట్ వల్ల తెలుగువారి పరువు అంతర్జాతీయంగా పోయిందన్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ నేత విచారణపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తానా అధ్యక్షుడు వేమన సతీష్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) ప్రశ్నించినట్టు  తెలుస్తోందని, చంద్రబాబు, లోకేష్‌లకు ఆయన అత్యంత సన్నిహితుడని ఆమె ఆరోపించారు. 
 
కాగా, ఇటీవల చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందాకు సూత్రధారులు మొదుగమూడి కిషన్, ఆయన భార్య మొదుగుమూడి చంద్రలు ప్రధాన సూత్రధారులు కావడంతో వారిద్దరనీ యూఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో పలువురు హీరోయిన్లకు కూడా సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

NTR: ఎన్.టి.ఆర్. డ్రాగన్ డేట్ ఫిక్స్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్

Prudhvi: రాజేంద్రప్రసాద్ సపోర్ట్ చేయకుంటే థర్టీ ఇయర్స్ కెరీర్ లేదు : పృథ్వీ

గ్రామీణ నేపథ్యంగా సురేష్ కొండేటి బ్రాండ్ తో వస్తున్న ప్రేమనే ఊరిలో చిత్రం

Rahul Sipligunj: చిక్కుల్లో పడిన రాహుల్ సిప్లిగంజ్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి...?

దుల్కర్ సల్మాన్.. ఐ యామ్ గేమ్ నుంచి ఎవరే నువ్వే గీతం విడుదల

తర్వాతి కథనం
Show comments