ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2023 (14:28 IST)

బైకుపై యువ జంట రొమాన్స్... సరైన ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీసులు (వీడియో)

romance on bike
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ ప్రేమ జంట రోడ్డుపై రెచ్చిపోయింది. బైకుపై వెళుతూ రొమాన్స్‌లో మునిగితేలింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్పందించిన పోలీసులు తమదైనశైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. 
 
ఓ యువకుడు నడుపుతుండగా, అతడిని కౌగలించుకుని ఓ యువతి బైకు ముందు భాగం అంటే పెట్రోల్ ట్యాంకుపై కూర్చొంది. పైగా, బైకు నిదానంగా వెళుతుందా అదీ లేదు. ప్రియుడు అమిత వేగంతో దూసుకెళ్లాడు. పైగా, ఇద్దరికీ హెల్మెట్స్ లేవు. వీరి వ్యవహారాన్ని కారులో వెళుతున్న ఓ వ్యక్త వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
ఈ ఘటన జాతీయ రహదారి 9పై ఇందిరాపురం పరిధిలో జరిగింది. దీనిపై ఘజియాబాద్ పోలీసులు స్పందించారు. ట్వట్టర్ అందిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నాం. చలానా జారీ చేశాం" అని ప్రకటించారు. పైగా, వాహనదారుడికి రూ.21 వేల అపరాధం చెల్లించినట్టు చెప్పాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.