సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (11:40 IST)

ప్రపంచ కాఫీ దినోత్సవం, కాఫీ పుట్టుక చరిత్ర తెలుసా?

ప్రపంచ కాఫీ దినోత్సవం. ప్రపంచ కాఫీ ప్రేమికులు సెలబ్రేట్ చేసుకునే రోజు. అసలు కాఫీ గింజ అనేది కాఫీ చెట్టు విత్తనం. ప్రపంచంలో అధికంగా వ్యాపారం జరుగుతున్న సరుకులలో కాఫీకి రెండో స్థానం లభించగా దాని చిల్లర అమ్మకాలు మాత్రమే ఇప్పుడు 70 బిలియన్ అమెరికా డాలర్లకు మించిపోయాయి.

 
కాఫీ జన్మస్థానం ఇథియోపియా, కాఫీ చెట్టు బహుశా ఆ దేశంలోని కప్పా ప్రాంతంలో పుట్టి ఉండవచ్చునని అంచనా. ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం ఎర్రని కాఫీ గింజలను నమిలిన తర్వాత తన మేకలు ఎంతో ఉత్సాహంగా ఉండడం చూసి ఒక ఇథియోపియా గొర్రెలకాపరి ఆశ్చర్యపోయాడట.

 
బాగా ప్రచారంలో ఉన్న మరో కథనం ప్రకారం, ప్రస్తుతం కాఫీకి పర్యాయపదంగా ఉన్న అలనాటి ప్రసిద్ధ రేవు అయిన మోకా రేవు మార్గం ద్వారా సూడాన్ నుంచి ఎమెన్, అరేబియాలకు తరలించబడుతున్న బానిసలు బాగా రసంతో నిండిన కాఫీ గింజ కండను నమిలేవారట. చరిత్రలో మక్కాలో ప్రారంభించబడిన మొట్టమొదటి కాఫీ షాపులను 'కవే కేన్స్' అనే పేరుతో పిలిచేవారట. ఇవి త్వరలోనే అరబ్ ప్రపంచమంతటా వ్యాపించాయి, చదరంగం ఆడుతూ, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ, పాట, నాట్యం, గానా బజానాలతో జనం సోలిపోయే ప్రాంతాల్లో కాఫీ షాపులు బ్రహ్మాండంగా విజయం సాధించాయి.

 
ఆరోజుల్లోనే కాఫీ షాపులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేవారు, వీటిలో ప్రతి ఒక్కటీ ప్రత్యేక స్వభావంతో అలరారేవి. చక్కటి అనుకూల పరిసరాల్లో సామాజిక, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించబడేచోట, సరసమైన ధరలతో కాఫీ అందరికీ అందుబాటులో ఉండగల కాఫీ షాపులను పోలినటువంటివి గతంలో ఎన్నడూ ఉనికిలో లేవు మరి. తరువాత కాఫీ డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్ వలసపాలకుల ద్వారా వారి వలసలలోకి కూడా వ్యాపించింది.

 
చరిత్రలో మొట్టమొదటి యూరోపియన్ కాఫీ షాప్ 1683లో వెనిస్ నగరంలో ప్రారంభించబడగా, పిజ్జా శాన్ మార్కోలో సుప్రసిద్ధ కెఫే ఫ్లోరియన్, 1720లో ప్రారంభించబడింది. ఇది ఈ రోజుకూడా విజయవంతంగా నడుస్తోంది. లండన్‌ నగరానికి చెందిన ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ఇన్సూరెన్స్ మార్కెట్ లాయిడ్స్, మొదట్లో కాఫీహౌస్‌నుంచి తన ప్రయాణం మొదలెట్టింది. తన కస్టమర్లు ఇన్సూర్ చేసిన ఓడల జాబితాను తయారుచేస్తున్న ఎడ్వర్డ్ లాయిడ్‌చే 1688లో ఇది ప్రారంభించబడింది. ఉత్తర అమెరికాలో మొట్టమొదటిసారిగా కాఫీ సేవించిన ఘటన 1688లో ప్రస్తావించబడింది.

 
1773 నాటి ప్రఖ్యాత బోస్టన్ టీ పార్టీ ఘటనకు గ్రీన్ డ్రాగన్‌అనే కాఫీ హౌస్‌లో పథకం రచించబడింది. అలాగే న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్ మరియు బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ సంస్థలు మొదట్లో కాఫీ హౌస్‌లలో ప్రారంభించబడ్డాయి. ఇవ్వాళ ఆ స్థలమే వాల్‌స్ట్రీట్ అనే ఆర్థిక జిల్లాగా ఖ్యాతి పొందింది. అమెరికా చరిత్రలో కాఫీ పంట తొలిసారిగా 1720లలో పండించబడింది. కాఫీ చరిత్రలో అదొక అత్యంత అద్భుతమైన, రోమాంచిత గాథ.

 
ఇవ్వాళ దాదాపు 60 దేశాలు, ఎక్కువగా వర్ధమాన దేశాలు కాఫీని పండిస్తుండగా యూరప్, అమెరికా, జపాన్ వంటి పురోగామి దేశాలలో కాఫీ వినియోగం కేంద్రీకృతమైంది. పంచంలో అతిపెద్ద కాఫీ వినియోగదారుగా అమెరికా అగ్రస్థానంలో ఉండగా, అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారుగా బ్రెజిల్ నిలిచింది. కాగా కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసే ఆరు దేశాల సరసన భారత్ చేరింది.