ఐదు పైసల నాణేనికి ప్లేట్ బిర్యానీ.. ఎక్కడో తెలుసా?

గురువారం, 17 అక్టోబరు 2019 (12:54 IST)
ప్లేట్ బిర్యానీ ధర సాధారణంగా వంద రూపాయలుంటుంది. అయితే ఒక ప్లేట్ బిర్యానీ ఐదు పైసలకే అందించారు. అవును.. తమిళనాడులోని దిండుక్కల్‌లో ఓ దుకాణంలో ఒకటిన్నర ప్లేట్ బిర్యానీని 5పైసలకే అందించారు. వివరాల్లోకి వెళితే.. దిండుక్కల్ బస్టాండ్ సమీపంలో వున్న ముజిఫ్ బిర్యానీ దుకాణం వారు ఈ ఆఫర్ ఇచ్చారు. 
 
ఐదు పైసల నాణేన్ని తెచ్చిన తొలి వంద మందికి ఒకటిన్నరి ప్లేటు చికెన్ బిర్యానీ ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇలా ఐదు పైసలు నాణేలను తెచ్చిన వారి పేర్లు, సెల్ ఫోన్ నెంబర్లు తీసుకొచ్చిన వారికి బిర్యానీ అందజేశారు. మనం ఉపయోగించిన వస్తువులు, నాణేలపై రానున్న తరానికి అవగాహన కల్పించేందుకే తాము ఇలా చేసినట్లు దుకాణం యజమాని ముజిఫర్ రహ్మాన్ తెలిపారు.
 
ఐదు పైసల నాణాలు దొరకని వారు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయితే ఇలా చేయడానికి ఓ విశేషం ఉందంటున్నారు ముజీబ్ బిర్యానీ యజమానులు. అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే కావడం ఒక కారణం అయితే దాదాపుగా కనుమరుగవుతున్న వస్తువులు, నాణాలపై రానున్న తరాలవారికి అవగాహన కల్పించడానికే ఈ విధంగా చేశామని తెలిపారు.

అన్నీ చూడండి

Kiran Abbavaram,: యు/ఎ సర్టిఫికేషన్ పొందిన కిరణ్ అబ్బవరం... చెన్నై లవ్ స్టోరీ

Ravi Teja : ఇరుముడి' డబ్బింగ్ ప్రారంభించిన రవితేజ- త్వరలోనే సెకండ్ సింగిల్

శాన్‌ఫ్రాన్సిస్కోలో M4M 2 మూవీ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు

Sitara: ఎప్పటికీ చిన్నారి తార.. సితార అంటూ మహేష్ బాబు ఆప్యాయంగా ముద్దుపెట్టారు.

Vijay Deverakonda: రౌడీ జనార్థన మూవీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments