Dharma Sangrah

జిమ్‌లో వ్యాయామం చేస్తుంటే వీడియో తీసి మార్ఫింగ్ చేసారు, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రండి: వైసిపి ఎంపి నగ్న వీడియోపై సవాల్

Written By ఐవీఆర్
Updated: గురువారం, 4 ఆగస్టు 2022 (18:31 IST)
వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. అందులో గోరంట్ల మాధవ్ నగ్నంగా వున్నారనీ, ఓ మహిళతో మాట్లాడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసిపి ఎంపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.

 
తను జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు ఎవరో వీడియో తీసారనీ, దాన్ని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆ వీడియోను ఎవరు అప్ లోడ్ చేసారో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

 
ఇలాంటి చౌకబారు వ్యవహారాలు కాకుండా ఏదైనా వుంటే ఫేస్ టు ఫేస్... దమ్ముంటే తన ముందుకు రావాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ తనపై చేస్తున్న కుట్రలో ఇదో భాగమని ఆరోపించారు. అప్ లోడ్ చేసిన వీడియోను ఫోరెన్సిక్ ల్యాబుకి పంపి తనపై బురద జల్లుతున్నవారి భరతం పడతామంటూ వెల్లడించారు.

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments