శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2022
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (10:55 IST)

రూ. 1000కి చేరువలో గ్యాస్ బండ: బడ్జెట్టులో బండ బరువు దించుతారా?

గ్యాస్ బండ రూ. 1000కి చేరువలోకి వచ్చేసింది. అక్టోబరు నుంచి నాన్ సబ్సిడీ డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. నవంబర్‌ నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.

 
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2022ను సమర్పించడానికి కొన్ని గంటల ముందు, చమురు మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ ధరలను విడుదల చేశాయి.

 
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ధరల తగ్గింపును కొనసాగించింది. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ. ఫిబ్రవరి 1న, ఢిల్లీలో సబ్సిడీ లేని (14.2 కిలోలు) ఇండేన్ డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 899.50కి అందుబాటులో ఉంటుంది. 

 
అక్టోబరు నుంచి నాన్ సబ్సిడీ డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. నవంబర్‌ నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఓటింగ్ నిర్వహించి మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

 
అటువంటి పరిస్థితిలో, దేశీయ LPG సిలిండర్ ధర పెరిగే అవకాశం చాలా తక్కువ. వాణిజ్య సిలిండర్ల ధరల్లో కొంత మార్పు ఉండవచ్చు. రూ. 1000కి చేరువలో వున్న సిలిండర్ ధరపై కేంద్రం ఏమయినా సబ్సిడీలను ప్రకటిస్తుందేమో చూడాలి.