బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : బుధవారం, 17 అక్టోబరు 2018 (15:01 IST)

ఇంట్లో లిఫ్టు ఎలా అమర్చుకోవాలో తెలుసా..?

కొందరైతే పెద్ద పెద్ద ఇంటి నిర్మాణాలు చేస్తుంటారు. అలా కట్టుకుంటే బాగుంటుందని భావిస్తారు. ఇటువంటి పెద్ద ఇంటికి లిఫ్టుంటే ఇంకా మంచిదని అనుకుంటారు. కానీ ఆ లిఫ్టును ఏ దిశలో అమర్చుకోవాలో తెలియక సతమతమవుతుంటారు.

కనుక వాస్తుశాస్త్రం ప్రకారం లిఫ్టును ఏ దిశలో కట్టుకోవాలో తెలుసుకుందాం.. ఇంటిలోపలి నైరుతిలో, ఈశాన్యంలో లేదా ఇంటి గర్భంలో కాకుండా లిఫ్టును అన్ని చోట్లా పెట్టుకోవచ్చును. వాయవ్యంలోనే రావాలి అనేది లేదు. ఎందుకైనా ఇంటి గదులను బట్టి లిఫ్టును ఏర్పాటు చేసుకుంటే మంచిది.

ఇంటి బేస్‌మెంట్‌ను మూడు నుండి నాలుగు అడుగుల ఎత్తు వచ్చేలా నిర్మించి లిఫ్టును అమర్చుకోవాలి. ఇలా చేస్తే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఒకవేళ లిఫ్టును హాలులోనికి లేదా మూలలోకి పెట్టాల్సి వస్తే దానికి ఎదురుగా ఏమీ రాకుండా చూసుకోవాలి.