వాస్తు ఇంటి యజమానికి మాత్రమే వర్తిస్తుందా?

శనివారం, 13 జూన్ 2015 (17:49 IST)
వాస్తు ఇంటిలో నివసించే అందరిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్క యజమానికో లేదా యజమానురాలుకో సంబంధించిన విషయం కాదు. వారి సంతానం మగ అయినా ఆడ అయినా వాస్తు ప్రభావం వారిపైన కూడా ఉంటుంది. ఈ ప్రభావం ఏ సందర్భంలో ఎలా ఎవరిపై పనిచేస్తుందన్నది ఆ ఇంటిని బట్టి వివరించాలి. 
 
వాస్తు టిప్స్.. 
ఇంటిలో గోడలు వెడల్పులు తగ్గించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బీరువాని వుంచటానికి నైరుతిమూల గోడమందం తగ్గించకూడదు. దీనివలన నైరుతిమూల పెరిగినట్లవుతుంది. అలాగే తూర్పు ఆగ్నేయం గోడ మందం తగ్గించి అక్కడ వంట కోసం పొయ్యిని ఏర్పాటు చేయకూడదు. ఇలా గోడమందం కొన్నిచోట్ల తగ్గించడం వలన ఇంటి కొలతలతో తేడా వస్తుంది. అది మంచిది కాదు. గోడ మందాలు తగ్గించి అక్కడ అలమరలు ఏర్పాటు చేసుకోవచ్చు.   
 
ఈశాన్యంలో పోర్టికో కట్టుకోవడం వల్ల ఈశాన్యమున అధిక బరువు అంటారు. కాని ఇలా అనటం సరికాదు. తూర్పు లేదా ఉత్తర ఈశాన్యమూలలో పోర్టికో కట్టుకోవచ్చు. స్థలం కన్నా రోడ్డు ఎత్తులో ఉండకూడదు. ఎప్పుడూ రోడ్డు కంటే ఇల్లు ఎత్తులో ఉండాలి. నైరుతిగది వైశాల్యం ఈశాన్యగది వైశాల్యమున కన్నా ఎక్కువగా వుండాలి. అనగా నైరుతి గది ఈశాన్యం గదికన్నా పెద్దదిగా వుండాలి. 

అన్నీ చూడండి

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

Show comments