వాస్తు: ఇరుకైన చిన్న స్థలంలో ఇల్లు కడుతున్నారా?

శనివారం, 12 జులై 2014 (18:40 IST)
ఇరుకైన చిన్న స్థలంలో ఇల్లు కట్టే వారు, విదిక్కులు తిరిగిన స్థలాలో ముఖ్యంగా తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయవ్యాలలో మెట్లు పెట్టాలనుకునే వారు మరింత శ్రద్ధ వహించాలి. పునాదులు మొదలుపెట్టి గోడలు నిర్మించేటప్పుడు ఎన్ని కిటికీలు పెట్టాలి అన్న విషయం దగ్గర్నుంచి కిటికీలు ద్వారాలకు సరిపోయే విధంగా మార్కు చేశారా, అలమరాలు ఎలా అమరుస్తున్నారన్నదాన్ని తప్పకుండా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 
 
మెట్లు మార్కింగ్ చేసేటప్పుడు ఈ విషయాలపై దృష్టి పెట్టడం ఎంతైనా అవసరం. అలాగే శ్లాబు వేసే ముందు దాని వాటం ఎలా ఉంది.. బాల్కనీలో ఎలా ఉందీ అన్న విషయాలు ముందుగా ప్లాన్‌లో వేసుకున్న విధంగా సరిగా ఉన్నాయో లేదో  చూసుకోవటం తప్పనిసరి. గోడలు నిర్మించి లాప్ట్ కట్టేటప్పుడు, ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ప్లాను ప్రకారం జరుగుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అదే విధంగా ఫ్లోరింగ్ మొదలైనప్పుడు వాటం సరిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. 
 
ఇంట్లో నిర్మించే సెప్టిక్ ట్యాంకులు, నీళ్ల సంపుల మార్కులు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత బయట అరుగులు కట్టే వారైతే వాటి మార్కింగ్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇల్లు పూర్తవుతున్న సమయంలో ప్లాను ప్రకారం అన్ని సరిపోయాయా లేదా సరిచూసుకోవాలి. ఇవన్నీ సక్రమంగా లేకపోతే తప్పకుండా ప్రతికూల ఫలితాలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్నీ చూడండి

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై దాడి చేసిన మహిళ

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం

నెల్లూరులో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు

వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు : 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

Show comments