Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బిడ్డకు కన్నతల్లి పాలు, ఇక్కడ కాదు వేరే చోటకెళ్లి పాలివ్వు

Written By సిహెచ్
Updated: సోమవారం, 3 ఆగస్టు 2020 (23:17 IST)
తల్లి పాలు శిశువుకి అత్యంత సహజమైన పోషకాహారం. ఈ పాలు బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలను సరైన నిష్పత్తిలో సరఫరా చేస్తాయి. అలెర్జీలు, అనారోగ్యాల నుండి రక్షిస్తాయి. ఎన్నో వేల సంవత్సరాలుగా, మానవులతో పాటు ఇతర క్షీరదాలన్నీ తల్లి పాలివ్వడం ద్వారా తమ పిల్లలను పోషిస్తూ వస్తున్నాయి. కానీ నేటికీ, తల్లి పాలివ్వడం చుట్టూ ఓ రకమైన ఇబ్బంది వుంది. అలా తల్లి పాలివ్వడం అనేది సమాజంలో తరచుగా ఆమోదయోగ్యం కానిదిగా కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇది బహిరంగ ప్రదేశంలో తల్లి బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు.
 
బేబీ ప్రొడక్ట్ బ్రాండ్ టామీ టిప్పీ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలిన విషయాలు ఇలా వున్నాయి. పాలిచ్చే తల్లుల గురించి కలత పెట్టే గణాంకాలను వెల్లడయ్యాయి. బహిరంగంగా తల్లి పాలివ్వడంలో ప్రతి ఆరుగురిలో ఒకరు అవాంఛిత లైంగిక దృష్టిని ఎదుర్కొన్నారని వెల్లడించింది.
 
26 శాతం మంది తమ బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు అపరిచితులతో చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. 27 శాతం మంది మహిళలకు మరో ఇబ్బందికరమైన పరిణామం ఏంటంటే... తాము తల్లిపాలు వేరే ప్రాంతాలకు వెళ్లి ఇవ్వమని చెప్పడం.
 
 ఇక 10 మందిలో ఒకరికి మరో రకమైన అనుభవం ఏంటంటే... బిడ్డకు పాలు ఇచ్చేటపుడు ఎద భాగాన్ని కప్పుకుని పాలివ్వాలన్నది. అదనంగా, మరో ఎనిమిది శాతం మంది మహిళలు తమ బిడ్డకు పాలిచ్చేటప్పుడు అవాంఛిత లైంగిక దృష్టిని, అలాంటి వ్యాఖ్యల రూపంలో పొందారని పేర్కొన్నారు. ఈ పరిస్థితులు మారాలనీ, తన బిడ్డకు పాలు ఇచ్చేటపుడు తల్లి ఎదుర్కొనే ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పెట్టాలని అంటున్నారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం