గర్భిణీలకు మేలు చేసే బత్తాయి పండు
సాధారణంగా అన్ని రకాల పండ్లను మనం మార్కెట్లో చూస్తుంటాం. అయితే వాటిలో అన్ని ఆరోగ్యకరమైనే అయినా, మరికొన్ని అత్యంత ఆరోగ్యకరంగా ఉంటుంది. అధిక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పండ్లలో బత్తాయి కూడా ఒకటి. ఈ సీజన్‌లో మార్కెట్లలో ఈజీగా దొరికేవి బత్తాయి పండ్లు. బత్తాయి రసంలో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు, రుచికరమైనది. తాజాగా ఉండి మనల్ని రిఫ్రెష్ చేస్తాయి. ఈ బత్తాయి జ్యూస్ శరీరాన్ని చల్లబర్చడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
పీచు పదార్థాలు, జింక్, కాపర్, ఐరన్ శక్తి, కాల్షియం వంటివి బత్తాయిలో ఉన్నాయి. క్యాలరీలు, ఫ్యాట్ కూడా తక్కువగా ఉంది. ఉదర సంబంధింత రోగాలకు బత్తాయి పండ్లు దోహదపడుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ పండ్ల రసాన్ని రోజూ ఓ గ్లాసు తీసుకోవడం ద్వారా శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. గర్భిణీ స్త్రీలను తరచూ బత్తాయి రసాన్ని త్రాగమని వైద్యులు అంటున్నారు. ఇందులో ఉండే కాల్షియం, కడుపులో పెరిగే బిడ్డకు, తల్లికి మేలు చేస్తుంది. బత్తాయి రసంను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
నోటిపూత, గొంతునొప్పి, ఉదర సంబంధిత రోగాలకు కూడా బత్తాయి దూరం చేస్తుంది. బత్తాయిని తీసుకుంటేనే శరీరానికి అందాల్సిన పోషకాలు అందుతాయి. బత్తాయి శరీరానికి శక్తినివ్వడంతో పాటు రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పండుకున్న తీపి వాసన లాలాజల గ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం అధికంగా ఊరేందుకు కారణమవుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు పిత్తరసంతోపాటు ఇతర జీర్ణరసాలు, ఆమ్లాలు విడుదలయ్యేందుకు సహాయపడుతుంది. అందువల్ల తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా ఈ రసం తొందరగా జీర్ణమై రక్తంలో కలిసిపోతుంది. శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. హృదయ సంబంధిత రోగాలను నయం చేస్తుందని న్యూట్రీషన్లు అంటున్నారు.