1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chj
Last Modified: సోమవారం, 27 జూన్ 2016 (13:37 IST)

గర్భణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు... చక్కని సంతానం కోసం...

స్త్రీలు గర్భం ధరించినప్పుడు ఏయే నియమాలను కచ్చితంగా పాటించాలో ఆయుర్వేద మహర్షులు వేల ఏళ్ల క్రితమే నిర్థారించారు. ఆ నియమాలను తు.చ తప్పకుండా పాటిస్తే చక్కని సంతానాన్ని పొందవచ్చు. ఉదయం లేక సాయంత్రం సంధ్యా సమయాలలో గర్భణీ స్త్రీలు భోజనం చేయకూడదు. పగటి పూట

స్త్రీలు గర్భం ధరించినప్పుడు ఏయే నియమాలను కచ్చితంగా పాటించాలో ఆయుర్వేద మహర్షులు వేల ఏళ్ల క్రితమే నిర్థారించారు. ఆ నియమాలను తు.చ తప్పకుండా పాటిస్తే చక్కని సంతానాన్ని పొందవచ్చు. ఉదయం లేక సాయంత్రం సంధ్యా సమయాలలో గర్భణీ స్త్రీలు భోజనం చేయకూడదు. పగటి పూట అతిగా నిద్రపోకూడదు. బాగా అలసటగా అనిపించినప్పుడు కొంత సమయం విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ సూర్యుడు ఉన్న సమయంలో అతిగా నిద్రపోరాదు. నీళ్ళల్లో పాదాలు నానిపోయేటట్లుగా ఎక్కువ సమయం నీటిలో దిగి వుండకూడదు. 
 
అమంగళకరమైన మాటలు గర్భణీ స్త్రీల నోట రాకూడదు. మనసును ఆందోళన పరిచే సంఘటనలు, దృశ్యాలు, విషాద వార్తలు, ఇంటి గొడవలు, ఇరుగుపొరుగు వారితో కయ్యాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. అతిగా శరీరాన్ని క్షోభ పెట్టే శారీరక వ్యాయామం గానీ, శారీరక శ్రమ గానీ చేయకూడదు. గర్భణీ స్త్రీలు అతిగా మాటిమాటికీ తలస్నానం చేయకూడదు. వెంట్రుకలు విరబోసుకోకూడదు. రాత్రి నిద్రించేటప్పుడు తల దక్షిణం వైపు ఉంచాలి. పొరపాటుగా కూడా ఉత్తర దిక్కు వైపు తలపెట్టి నిద్రించకూడదు. అతిగా ఎక్కువసేపు నవ్వకూడదు. సుగంధ మూలికలతో నానబెట్టిన నీటితో స్నానం ఆచరిస్తే మంచిది.