శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (14:14 IST)

జై జగన్ అంటూ నోరు జారిన చరితా రెడ్డి.. ఈలలతో మార్మోగిన ప్రాంగణం...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన కర్నూలు నేత గౌరు చరితా రెడ్డి ప్రచారం సందర్భంగా నోరు జారారు. పాణ్యంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యేగా తనను, లోక్‌సభ సభ్యుడిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల్లో టీడీపీకే ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. 
 
చివరగా జై జగన్ అని గట్టిగా నినాదం ఇవ్వడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు షాక్ తిన్నారు. అనంతరం ఒక్కసారిగా ‘జై జగన్’ అని అని నినాదం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఈలలతో మార్మోగింది.
 
 వెంటనే తేరుకున్న చరితారెడ్డి నవ్వుతూ.. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని నినాదాలు ఇచ్చి ముందుకు కదిలారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నాయి.