గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 మే 2024 (12:51 IST)

పవన్ కళ్యాణ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన హీరో నాని!!

Nani
సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు హీరో నాని మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్న జనసేనానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినీ కుటుంబంలో ఒకడిగా పవన్ కళ్యాణ్‌కు మద్దతు పలుకుతున్నట్టు వివరించారు. 
 
"ఈ ఎన్నికల పోరాటంలో మీరు గెలవాలి. ప్రజలకు ఇచ్చిన హామీలన్ని నిలబెట్టుకోవాలి. ఆల్ ది వెరీ బెస్ట్ సర్" అంటూ నాని ట్వీట్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మద్దతు కూడా పవన్ కళ్యాణ్‌కే ఉంటుందని నాని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ సొంత అన్న మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్‌‍కు మద్దతు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెల్సిందే.